Etela Rajender: సర్పంచ్ అభ్యర్థులకు ఈటెల రాజేందర్ హెచ్చరిక..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జరుగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని, తొందరపడి దసరాకు విందులు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు లీగల్‌గా చెల్లుబాటయ్యే పరిస్థితి లేకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ఈటెల మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగబద్ధంగా లేని విధంగా జరుగుతున్న ఎన్నికలు. కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది?" అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితే ఎదురైందని గుర్తుచేశారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక హైకోర్టు...