Hyderabad Ganja Seized: రూ.6 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్న రాజకొండ పోలీసులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతోంది. స్మగ్లర్లు ఎక్కడో చోట అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా కొనసాగిస్తున్నారు. భావితరాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ప్రభుత్వం ఎన్నిక అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినప్పటికీ మాదక ద్రవ్యాల వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే....