Viral News: హోంవర్క్ చేయలేదని.. 2వ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ కర్కశం

కాకతీయ, నేషనల్ డెస్క్: హర్యానాలోని పానిపట్‌లో ఉన్న శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ప్రిన్సిపాల్ కఠినంగా శిక్షించింది. బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి, డ్రైవర్ చేతితో కొట్టించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే, ఆగస్టు 13న ఈ సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో బాలుడిని కిటికీకి వేలాడదీసి డ్రైవర్ అజయ్ కొడుతున్న దృశ్యాలు...