ఎన్నికల నిర్వహణకు రాజకీయ నాయకులు సహకరించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ సమావేశం పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు కాకతీయ, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజకీయ నాయకులందరూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. మొదటి విడతలో హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో, రెండో విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో,...