ఖాకీల కంటే సఫాయి కర్మచారులే ఆదర్శం
సీఐ నాగార్జునరావుపై చర్య తీసుకోవాలి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కాకతీయ, మంథిని : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్థానిక పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఖాకీ వేషధారణతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల స్థానంలో, నిజంగా సమాజానికి సేవ చేస్తున్న సఫాయి కర్మచారులే ఆదర్శమని పుట్ట మధూకర్ అన్నారు. రెండు రోజుల క్రితం కాటారం పోలీసులు బీఆర్‌ఎస్ మండల ఇంచార్జీ జోడు శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేయగా, ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మధూకర్ పరామర్శించారు. అనంతరం...