విద్యార్ధులను భావి భారత పౌరులుగా చేయటంలో టీచర్స్ పాత్ర కీలకం ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పార్ధసారధి చెప్పారు. మంగళవారం నగరంలోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హాలులో ఎస్ & ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ-2025 సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి కొలుసు పార్ధసారధి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డీఎస్సీ అంటే అందని ద్రాక్ష పండులా ఉండేదని...