ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించారారని సీపీ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవీ విరమణ చేసిన వారు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారు భావి జీవితం ఆయురారోగ్యాలతో,...