కొత్తగూడెం అభివృద్ధికి సహకరించాలి
సింగరేణి చైర్మన్ ను కోరిన ఎమ్మెల్యే కూనంనేని కాకతీయ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సింగరేణి సంస్థ ద్వారా సహకరించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంస్థ ప్రధాన కార్యాలయంలో బలరాంను స్వయంగా కలిసి పలు ప్రతిపాదనలు ముందుంచారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనాలకు సంస్థ ద్వారా నిధులు మంజూరు చేయాలని, సిఎస్ఆర్ ఫండ్...