పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు విడుద‌ల చేయాలి

రూ. 5500 కోట్ల కాంట్రిబ్యూష‌న్ పెన్షన్ డబ్బుల‌ను మళ్ళించిండ్రు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 3 శాతం డీఏ మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింద‌ని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏ తక్షణమే...