Actor Vijay: కరూర్ ఘటన నేపథ్యంలో.. టీవీకే విజయ్ కీలక నిర్ణయం.. !

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కరూర్‌ తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, విజయ్‌ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీవీకే స్పష్టం చేసింది. పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలు, బహిరంగ సభల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇకపోతే, పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత వచ్చే...