BJP: అన్ని స్థానాల్లో బీజేపీదే పై చేయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ సారి ఎన్నికల సందర్భంలో జడ్పీటీసీ అభ్యర్థులను ముందుగా డిక్లేర్ చేయాలని, ఏకగ్రీవంగా ఉన్న చోట బి.ఫారం సమర్పించాలని పార్టీ భావిస్తున్నదని రామచంద్రరావు పేర్కొన్నారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ అత్యధిక స్థానాలను సాధించేందుకు సన్నద్ధమై ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక ఎన్నికలలో ఓట్లు అడగడానికి అర్హతలేమని కూడా స్పష్టం చేశారు....