అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలి కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో పర్యావరణ సంరక్షణతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి ఎల్ఎండీ సమీపంలోని నర్సరీని సందర్శించారు. నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా నీరు సమయానికి అందించాలని, పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించి నర్సరీని శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు డివైడర్లలో మొక్కలు నాటాలని, ఉమెన్స్ కాలేజీతో పాటు పలు ప్రాంతాల్లో పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలని,...