IMD: దూసుకొస్తున్న వాయుగండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీక్రుతమైన అల్పపీడనం వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజాము నాటికి...