ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దాం
అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ దివాకర తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు...