మావోయిస్టుల కుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేశారు భద్రతా దళాలు. పామెడ్ ప్రాంతంలోని కౌరగుట్ట అడవుల్లో కోబ్రా 208 బెటాలియన్ బుధవారం కూంబింగ్ నిర్వహించింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు భూగర్భంలో పెద్ద మొత్తంలో దాచిపెట్టిన పేలుడు పదార్థాలు, వారు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కంచల్ గ్రామంలోని అడవుల్లో ఒక గొయ్యి తవ్వి మావోయిస్టులు ఈ సామాగ్రిని దాచిపెట్టినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. గన్ పౌడర్, బీజీఎల్ సెల్స్, కార్డెక్స్ వైర్, బీజీఎల్ రౌండ్లు, ఆర్డీఎక్స్,...