నెలలో మొదటి రోజునే ఠంచనుగా పింఛన్ల పంపిణీ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పింఛను దారులకు ప్రతి నెల మొదటి రోజునే ఠంచనుగా పింఛన్లను అందించి ఆర్థిక భద్రత కల్పిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ (డిసిఎంఎస్) బండి రామకృష్ణతో కలిసి నగరంలోని 12వ డివిజన్ నోబుల్ కాలనీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి స్వయంగా పింఛన్లు అందించి వారి బాగోగులను...