కాళేశ్వరానికి రిపేర్లు
బ్యారేజీ మరమ్మతులకు టెండర్లు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేయాలని సంకల్పించింది. వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికోసం ఈనెల 15 వరకు గడువు విధించింది. డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరుతూ జాతీయస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దెబ్బతిన్న బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా...