టూరిజం శాఖలో కోటి రూపాయల కుంభకోణం.. ప్రియుడి ఖాతాలోకి ప్రభుత్వ నిధులు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పర్యాటక శాఖలో కోటి రూపాయల నిధుల దుర్వినియోగం బయటపడింది. ఔట్‌సోర్సింగ్ జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రుతి అనే ఉద్యోగిని, దాదాపు రూ.1.05 కోట్ల ప్రభుత్వ సొమ్మును తన ప్రియుడి బ్యాంకు ఖాతాలోకి మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల క్రితం కన్సల్టెంట్‌గా టూరిజం శాఖలో చేరిన శ్రుతి, అనంతరం ఔట్‌సోర్సింగ్ మోడల్‌లో జూనియర్ అకౌంటెంట్ బాధ్యతలు చేపట్టింది. సిబ్బంది, కార్మికుల వేతనాలను ఆర్టీజీఎస్...