వృద్ధులు తమ జీవితాంతం సమాజానికి, కుటుంబాలకు సేవ చేసినవారే..!!
ఏలూరు/ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం - గ్రామ సచివాలయం వద్ద బుధవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పూలమాలలు, శాలువాలు కప్పి, పండ్లను అందించి మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. లు పట్ల సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యం, వారి హక్కుల పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేయడానికి అక్టోబరు 01వ తేదీన వృద్ధులు దినోత్సవం జరుపు కుంటున్నామని తెలిపారు. వృద్ధులకు గౌరవం, సంరక్షణ, అనుభవాలను గుర్తించడం, వృద్ధాప్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం...