ట్రైసిటీ పరిధిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఉర్సు రంగాలీల మైదానంలో దసరా ఉత్సవాల సందర్భంగా ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈనెల రెండు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడవ తేది ఉదయం ఐదు గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వాహనాల రూట్ మళ్లింపులివే.. ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళే భారీ వాహనాలు ఫున్నెలు క్రాస్ - ఐనవోలు, ఆర్చ్ - వెంకటాపురం - కరుణాపురం మార్గం ద్వారా...