Vaibhav Suryavanshi: రికార్డులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు..!!

కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూత్ టెస్టులో టీమిండియా అండర్-19 ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ రెండో రోజు ఆటలో కేవలం 78 బంతుల్లోనే సెంచరీ బాది, ఆస్ట్రేలియా గడ్డపై యూత్ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ తరపున...