Govt Teacher: ప్రభుత్వ ఉద్యోగం కోసం 3 రోజుల పసికందును పాతిపెట్టిన తల్లిదండ్రులు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా నందనవాడీ గ్రామంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగ భయంతో ఓ టీచర్, తన భార్యతో కలిసి నాలుగో సంతానం పసికందును బండరాయి కింద పాతిపెట్టారు. ఈ ఘటన గత నెల 28వ తేదీ తెల్లవారుజామున శిశువు ఏడుపుతో బయటకు వచ్చింది. మార్నింగ్ వాకర్స్ శిశువు ఏడుపును విన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుక్కపట్టి ఏడుస్తున్న మూడు రోజుల వయస్సు కలిగిన పసికందును బండరాయి కింద చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులు...