స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులెవరు? అనర్హులెవరు?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రాజకీయ చర్చలు, అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పల్లె వాతావరణం పండుగలా మారి ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు...