బీజాపూర్​ లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 49 మందిపై కోటి ఆరు లక్షల రూపాయల రివార్డు ఉండడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దే లక్ష్యం ఉన్నదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, భీకరమైన ఎన్‌కౌంటర్లు, ఆపరేషన్ కగార్ వంటి ప్రభుత్వ చర్యల కారణంగా పెద్దసంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. ఫలితంగా...