దారుణం..విద్యార్థినిపై దాడి, తర్వాత ట్రాక్‌పై యువకుడి మృతదేహం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట మండల పరిధిలో బుధవారం చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని దీప్తిపై దాడి చేసి చంపిన 19 ఏళ్ల యువకుడు అశోక్ తర్వాత రైల్వే ట్రాక్ వద్ద మృతదేహంగా పడి ఉండటం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ప్రకారం.. దీప్తి ఇంటర్ చదువుతోందని, అశోక్ కొంతకాలంగా ఆమెను ఇష్టపడుతున్నాడని తెలుస్తోంది. మంగళవారం దీప్తి బంధువుల ఇంటికి...