మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఎంజీబీఎస్, జేబీఎస్ సందర్శన ప్ర‌యాణికులకు క‌ల్పిస్తున్న వ‌స‌తుల‌పై ఆరా.. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : టీజీఎస్ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ లను పరిశీలించారు. ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. శుభ్రత, తాగునీటి సౌకర్యం, కుర్చీలు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను ప్రత్యేకంగా సమీక్షించి, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల‌ని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆయా బస్...