బిహార్ తుది జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువ..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తుది జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 3.8 శాతం తగ్గి 15.5 లక్షలు తగ్గగా, మహిళా ఓటర్ల సంఖ్య 6.1 శాతం తగ్గి 22.7...