Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉత్తర-వాయువ్య దిశలో కదులుతున్న వాయుగుండం శుక్రవారం (ఇవాళ) దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరాన్ని దాటింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాల ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి,...