విషాదం..భర్త అనారోగ్యం…తట్టుకోలేక భార్య ఆత్మహత్య..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాకు చెందిన ప్రణిత శర్మ అనే మహిళ తన ప్రాణాలను తీసుకుంది. ఆమె భర్త అపూర్వ జ్యోతి శర్మ వృత్తిరీత్యా అడ్వకేట్ కాగా, కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. అపూర్వ జ్యోతి శర్మ ఆరోగ్యం క్షీణించడంతో, ఈ నెల 20న గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయనను చేర్పించారు. అయితే చికిత్స సమయంలో వారు ఆస్పత్రి...