కరూర్ ఘటన.. సిట్ విచారణకు ఆదేశించిన మద్రాసు హైకోర్టు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: కరూర్‌లో టీవీకే పార్టీ (TVK) అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ర్యాలీ సందర్భంగా జనసందోహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని హైకోర్టు టీవీకే నేతలను ప్రశ్నించింది. ఘటన...