సంస్కరణలతో కొత్త సమస్యలు
కేంద్రానికి వచ్చే మూడేళ్లు కీలకం బీజేపీ శ్రేణులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం హాజరైన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్.. కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు చాలా కీలకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతి శాఖ అనేక కొత్త సంస్కరణలు తీసుకువస్తోందని.. వీటితో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొవాలని సూచించారు. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ...