బిడ్డా రేవంత్ …గుర్తుపెట్టుకో..తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తా: పీకే సంచలన కామెంట్స్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఎన్నికల హవా మొదలైన వేళ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నాయి. గతంలో బీహార్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇంకా మండిపడుతూనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీహార్...