మోదీ తెలివైన నాయకుడు.. టారిఫ్స్ వంటి ఒత్తిళ్లకు తలొగ్గరు : పుతిన్
కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌తో వాణిజ్య అసమతుల్యతలను సవరించేందుకు కీలక చర్యలు చేపట్టాలని తన ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. సోచీలో జరిగిన వాల్దై డిస్కషన్ క్లబ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ... భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలివైన, జాతీయవాద దృక్పథం కలిగిన జ్ఞానవంతుడైన నాయకుడిగా కొనియాడారు. పుతిన్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఎల్లప్పుడూ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన నిజమైన జాతీయవాది, వ్యూహాత్మక దృక్పథం కలిగిన నాయకుడు. అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారత్ రష్యా...