భారీ వర్షాలకు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా..!!

కాకతీయ, అమరావతి: ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజి, తోటపల్లి బ్యారేజీ పరిధిలో భారీ ఎత్తున వర్షపాతం...