Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎక్సైజ్ శాఖ వార్నింగ్​ ..!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో అబ్కారీ శాఖ ఇప్పటికే అలర్ట్ అయ్యింది. ఈ నెల 9 నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, అక్రమ మద్యం తరలింపు నిరోధించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు శాఖ వెల్లడించింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలో అక్రమంగా మద్యం రాకుండా, తనిఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లోని 139 పోలీస్ స్టేషన్ల పరిధిలో గుడుంబా తయారీ, సరఫరా,...