ఘనంగా భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం
ఘనంగా భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ముగిసిన దేవీశరన్నవరాత్రులు అమ్మవారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవీశరన్నవరాత్రులు విజయ దశమితో ముగిశాయి. ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించి కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపారు. ముందుగా చక్ర స్నానం, ధ్వజావరోహణం జరిపారు. దాదాపు ఎనభై వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శమీ వృక్షానికి పూజ చేసి జమ్మి ఆకులను భక్తులు పరస్పరం పంచుకున్నారు. విజయదశమి అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని...