సమస్యల సాధనకు ఎన్డీ పార్టీని గెలిపించాలి
న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య కాకతీయ, బయ్యారం : మండలంలో సుస్థిర పాలన కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో న్యూ డెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సుద్దరేవు, నారాయణపురం గ్రామాలలో స్థానిక ఎన్నికల గ్రామ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐలయ్య పాల్గొని మాట్లాడారు. న్యూ డెమోక్రసీ పార్టీ పేదల పార్టీ అని, గిరిజనుల పోడు భూముల హక్కులకై అలుపెరగని పోరాటం చేసిన పార్టీ అని...