అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు
రంగలీల మైదానంలో 70 అడుగుల రావణ ప్రతిమ దహనం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని ఉర్సు రంగాలీలా మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో మంత్రి కొండ సురేఖ, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కమిషనర్ చాహాత్ బాజ్ పాయి పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ ఆటోమెటిక్ స్విచ్ ఆన్ చేసి రావణ వధ, దసరా వేడుకలను ప్రారంభించారు. దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ...