అనాథ బాలుడ్ని ఆదుకునేదెవరు..?
విజయ్ కు అందని ఆసరా పెన్షన్ వెంటనే పింఛన్ ఇచ్చి ఆదుకోవాలంటున్న స్థానికులు కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ఎవరూ లేని అనాథకు మూడు నెలల నుండి పింఛన్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఆరో వార్డ్ పరిధిలోని బేతోలు గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన జినక విజయ్ పుట్టకతోనే పోలియోతో ఇబ్బంది పడుతున్నాడు. పోస్ట్ ఆఫీస్ లో గత 11 సంవత్సరాల నుండి సదరం సర్టిఫికెట్ ద్వారా పింఛన్ పొందుతున్నాడు. బాధితునికి మూడు నెలలుగా ఆసరా పింఛన్ అందకపోవడంతో...