కాంగ్రెస్‌కు బాకీ కార్డు ఎఫెక్ట్
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ రాజకీయ అస్త్రం కాంగ్రెస్ వైఫల్యాలపై ఇంటింటికీ కార్డుల పంపిణీ ప్రభుత్వంపై జనాగ్రహం స్పష్టమవుతోందన్న ధీమాలో గులాబీ లీడర్లు ఎమ్మెల్యేలూ సైతం పట్టించుకోకపోవడంపై అధిష్ఠానం సీరియస్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ బాకీ కార్డు నిరసనను బీఆర్ ఎస్ పార్టీ ఉదృతం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామని చెప్పిన తులం బంగారం బాకీ పడ్డారని, వికలాంగుల పెన్షన్ నెలకు 6000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలకు...