Heavy Rains: తిరుమలలో దంచికొడుతున్న వాన.. భక్తులకు ఇక్కట్లు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తిరుమలలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తిరుమల వాతావరణం అకస్మాత్తుగా మారింది. సాధారణంగా ఉదయం చల్లగా ఉండే తిరుమల గిరులు, ఈ అకాల వర్షంతో మరింత చల్లబడ్డాయి. చలి తీవ్రత పెరగడంతో భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురయ్యినా, కొండ ప్రాంతం ఇచ్చే తాజాదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. భారీ వర్షం కారణంగా నాలుగు ప్రధాన మాడవీధులు పూర్తిగా నీటమయమయ్యాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, దర్శనం అనంతరం బయటకు వచ్చినప్పుడు...