కుటుంబ వ్యవస్థను కాపాడుదాం

వ‌రంగ‌ల్ క్రైమ్ ఏసీపీ సదయ్య కాకతీయ, వరంగల్ బ్యూరో : కుటుంబ వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై ఉందని క్రైమ్ ఏసీపీ సదయ్య పేర్కొన్నారు. శనివారం రంగంపేటలోని వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్–1లో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులు, కేసు సీడి ఫైళ్లను పరిశీలించారు. పెండింగ్ కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులు, నిందితుల అరెస్టు వివరాలను స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సూర్యప్రసాద్ నుండి ఏసీపీ అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ సిబ్బందితో శాఖాపరమైన సమస్యలు,...