మాట్లాడటానికి ఏం లేదు.. మావోయిస్టులు లొంగిపోవాల్సిందే : అమిత్‌ షా

కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా మావోయిస్టుల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. ఆయుధాలు వదిలి చర్చలకు రావాలా? లేకపోతే పోరాటం కొనసాగించాలా? అన్న దానిపై వాళ్ల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇకపై ఎలాంటి చర్చలు జరగవని స్పష్టంచేశారు. “చర్చలకు అవకాశం లేదు, వాళ్లు చేయాల్సింది ఒక్కటే – ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవడం” అని హోంమంత్రి స్పష్టం చేశారు. లొంగిపోయే మావోయిస్టులను ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారికి పునరావాసం కల్పించడంతో పాటు...