గత రెండేళ్లలో 50లక్షల మందికి ఉపాధి : మోదీ
కాకతీయ, నేషనల్ డెస్క్: గత రెండు సంవత్సరాల్లో బిహార్‌లో సుమారు 50 లక్షల యువతకు ఉపాధి కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. యువత ప్రతిభను మరింత అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయి కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనతో పోలిస్తే నితీశ్ ప్రభుత్వం విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. విద్యా బడ్జెట్ పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు స్థాపించబడ్డాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బిహార్‌లోని 19 జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు ఆమోదించిందని,...