ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తాళ్లూరి పల్లవి
కాకతీయ,ఖమ్మం రూరల్; డిల్లీలొ ప్రదానమంత్రి నరేంద్రమోది చేతుల మీదుగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులకు చెందిన యువతి తాళ్లూరి పల్లవి శనివారం అవార్డును అందుకున్నారు. ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలొ ఈ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌లో ప్రధాని యువతలో స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు (PM-SETU) పథకాన్ని రూ. 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలొ బాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులకు అవార్డులను...