Heavy Rain: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం.. ఏటూరునాగారంలో అత్యధికంగా 11 సెం.మీ.
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా తెలంగాణలో వాతావరణం తీవ్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, యూసఫ్‌గూడ, ఖైరతాబాద్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం పడింది. వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. వికారాబాద్...