గుండెపోటుతో ఏసీపీ మృతి
స్వగ్రామంలో విషాదఛాయలు సంతాపం తెలిపిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సబ్బతి విష్ణుమూర్తి ఆదివారం రాత్రి హైదరాబాదులోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. 1991 బ్యాచ్ పోలీస్ శాఖలో ఎస్సైగా తన ఉద్యోగాన్ని ప్రారంభించిన విష్ణుమూర్తి ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో పదోన్నతులు పొందుతూ విధులు నిర్వహించారు. ముక్కు సూటిగా వ్యవహరించేవారు. రౌడీయిజం పెట్రేగిపోతున్న సమయంలో కొత్తగూడెం పట్టణంలో రౌడీయిజాన్ని...