బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు

బలమైన స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు కాకతీయ, కొత్తగూడెం రూరల్: బిజెపికి వ్యతిరేకంగా కలిసివచ్చే వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చవెంకటేశ్వర్లు వెల్లడించారు. సోమవారం స్థానిక మంచికంటి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కొంత గందరగోళంగా ఉందని అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ కూడా గందరగోళానికి...