ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు రావొద్దు

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమాన్ సింగ్ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఇతర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐకెపి, గిరిజన కార్పొరేషన్,...