ఆసుపత్రి కార్మికుల చర్చలు సఫలం

కాక‌తీయ‌, మంథని : పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చేపట్టిన చర్చలు సఫలమయ్యాయి. పెండింగ్ వేతనాలు సహా అనేక సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి హామీలు లభించాయి. సోమ‌వారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చ‌లు నిర్వ‌హించారు. ఈ సమావేశంలో మంత్రి పీఏ ఆకుల చంద్రశేఖర్, పెద్దపల్లి డీసీఏచ్‌ఎస్‌ డాక్టర్ శ్రీధర్, మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, కాంట్రాక్టర్ అఖిల్ పాల్గొన్నారు. కార్మికుల తరఫున సీఐటీయూ జిల్లా...